: రొంపిలోకి దిగాలని తల్లే బలవంతం చేస్తుంటే..!
కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లి... తన ఇద్దరు మైనర్ బిడ్డలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించింది. తమను ఈ కూపంలోకి నెట్టింది తల్లేనని ఆ టీనేజీ బాలికలు చేసిన ఫిర్యాదుతో ఇప్పుడామె కటకటాల్లోకి వెళ్లింది. థానే పోలీసులు గురువారం నాడు తెలిపిన వివరాల ప్రకారం, మునీర్ బాద్ ప్రాంతంలో తనిఖీలు చేస్తే, ఇద్దరు మైనర్ బాలికలు పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో దాయ్ గఢ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి, వ్యభిచార గృహం నడుపుతున్న ఆ బాలికల తల్లితో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్ ఫోన్లు రూ. 4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తల్లిపై మహిళల అక్రమ రవాణా సహా పలు కేసులు పెట్టామని వివరించారు. బాలికలను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించామని తెలిపారు.