: ప్రపంచంలో వెలుగు కనిపిస్తున్న అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి: ఐఎంఎఫ్


ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగులు కనిపిస్తున్న అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య జీ-20 ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు పాల్గొన్న సభలో ఆమె ప్రసంగించారు. పలు దేశాల పరపతి విధానాల్లో నెలకొన్న అనిశ్చిత స్థితి కారణంగానే గ్లోబల్ మార్కెట్లపై నీలినీడలు కమ్ముకున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పలు సమస్యలు ఉన్నాయని, చైనాలో నెలకొన్న సమస్యలను స్టాక్ మార్కెట్లు ఎక్కువగా చూస్తున్నాయని, అనుకున్నంత సమస్యలు లేకపోయినా ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి నమోదవుతుందంటే అది ఇండియాలో మాత్రమే కనిపిస్తోందని అన్నారు. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ, చైనాలో మాంద్యం కారణంగానే సమస్యలు పెరిగాయని అన్నారు. ఈ సమావేశాలకు సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, చైనా, అమెరికా తదితర దేశాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News