: ‘హీరో’ఇక మల్టీ నేషనలే!... మెక్సికో, అర్జెంటీనా, బ్రెజిల్ విస్తరించనున్న భారతీయ కంపెనీ


నిన్నటిదాకా జపాన్ కు చెందిన ‘హోండా’తో కలిసి మోటార్ సైకిళ్ల ఉత్పత్తిని చేపట్టిన ‘హీరో’ గ్రూపు, ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచుకుని ‘హీరో మోటో కార్ప్’ గా అవతరించింది. సొంతంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని సముపార్జించుకున్న ఈ సంస్థ ఇకపై బహుళ జాతి సంస్థగానూ ఎదిగేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంది. ఇందులో భాగంగా మెక్సికో, అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాల్లో సొంతంగా మోటార్ సైకిళ్ల ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో పవన్ ముంజాల్ ప్రకటించారు. ఇప్పటికే 70 మిలియన్ డాలర్లతో కొలంబియాలో ఏర్పాటు చేస్తున్న ఆ సంస్థ ప్లాంట్ ఈ వారంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ ప్లాంట్ కేంద్రంగా మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లోనూ మోటార్ సైకిళ్ల ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ను పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నామని ముంజాల్ చెప్పారు.

  • Loading...

More Telugu News