: 'ప్రకటనల' తీర్పుపై పునఃసమీక్షకు సుప్రీం అంగీకారం


ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రకటనలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఫోటోలు తప్ప మరెవ్వరి ఫోటోలు ముద్రించరాదంటూ కొన్ని నెలల కిందట అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తాజాగా ఆ తీర్పుపై తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, అసోం ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించాయి. ప్రభుత్వ ప్రకటనలపై ముఖ్యమంత్రుల ఫోటో ప్రచురించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ గొగోయ్ ఈ నెల 14న వాదనలు వినేందుకు అంగీకరించారు.

  • Loading...

More Telugu News