: ఒరిజినల్ తెలుగు అంటే తెలంగాణ భాషనే: పద్మా దేవేందర్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస తీరని అన్యాయానికి గురయ్యాయని టీఎస్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అసలు ఒరిజినల్ తెలుగు అంటేనే తెలంగాణ భాష అని ఆమె చెప్పారు. తెలంగాణ భాషకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషను శ్వాసగా చేసుకుని రచనలు చేశారని కొనియాడారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ, పద్మా దేవేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.