: ఏ-320 విమానాలను వదిలించుకోనున్న ఎయిర్ ఇండియా


దీర్ఘకాలం నుంచి సేవలందిస్తూ, పాతవైపోయిన విమానాలను వదిలించుకోవాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. ముఖ్యంగా 20 సంవత్సరాలు దాటిపోయిన ఎ 320 విమానాలను పక్కన బెట్టాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. నిన్న ఖజురహో నుంచి వారణాసికి బయలుదేరిన విమానంలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. అదే విమానం గాల్లోకి ఎగిరిన తరువాత ఈ పరిస్థితి ఏర్పడితే... ఊహించడానికే భీతి గొలుపుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆరు నెలల కాలంలో విమానాలను రీప్లేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 64 ఏ-320 విమానాలుండగా, వాటిల్లో 14 విమానాలకు కాలం తీరిపోయింది. మొత్తం 19 కొత్త విమానాలను తీసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆపై దశలవారీగా మిగతా వాటినీ మారుస్తామని వివరించారు. కాగా, నిన్న ప్రమాదం జరిగిన విమానం 21 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఇక మరో ప్రమాదం జరగక ముందే, 20 ఏళ్లకు పైబడిన విమానాలను మార్చాలని సంస్థ ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News