: యాపిల్ కొత్త ఐఫోన్ వచ్చేసింది... ధర రూ.13 వేల నుంచి 33 వేలు!


అంతా అనుకున్నట్టే, నిన్న యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఘనంగా ప్రకటించింది. ఐఫోన్ సిరీస్ లో కొత్త మోడల్ ఐఫోన్ 6 ఎస్ తో పాటు, 6 ఎస్ ప్లస్ ను కూడా ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వరల్డ్ వైడ్ మార్కెటింగ్) ఫిలిప్ సిల్లర్ నిన్న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన మీడియా సమావేశంలో మార్కెట్లోకి విడుదల చేశారు. 16 జీబీ స్టోరేజీతో మొదలయ్యే ఈ ఫోన్లు 128 జీబీ సామర్థ్యం వరకు లభిస్తాయి. అమెరికా, బ్రిటన్ లతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, జపాన్, న్యూజిలాండ్, పొర్టోరికో, సింగపూర్ తదితర దేశాల్లో ఈ నెల 12 నుంచి ఐఫోన్ కొత్త మోడళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి వినియోగదారులకు పంపిణీ మొదలు కానుంది. ధర విషయానికి వస్తే గత మోడళ్ల కంటే కూడా తాజా మోడళ్ల రేట్లపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఫోన్ 6 ఎస్ విషయానికొస్తే రూ.13 వేల నుంచి 26 వేల వరకు ఉంది. ఇక ఐఫోన్ 6 ఎస్ ప్లస్ విషయానికొస్తే రూ.20 వేల నుంచి 33 వేల మధ్య ఉండనుంది. ఇదిలా ఉంటే, భారత్ లో వీటి ధరలకు సంబంధించి యాపిల్ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అంతేకాక ఎప్పటిలోగా భారత వినియోగదారులకు వీటిని అందజేస్తామన్న విషయాన్ని కూడా ఈ దఫా యాపిల్ వెల్లడించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News