: ధోనీ కెరీర్ ఇక ముగిసినట్టేనా?


ధోనీకి బీసీసీఐ ఉద్వాసన పలకనుందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి బీసీసీఐ వర్గాలు. టెస్టు, వన్డే జట్లకు విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు కెప్టెన్లు ఉండడంతో దాని ప్రభావం ఆటగాళ్లపై పడుతుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. దీంతో టెస్టు, వన్డే ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను కొనసాగించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సౌతాఫ్రికా సిరీస్ లో ధోనీ స్థానంలో కోహ్లీకి జట్టు పగ్గాలు అందించాలని బీసీసీఐ భావిస్తోంది. సౌతాఫ్రికా సిరీస్ లో టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది. వచ్చే ఏడాది జరిగే టీట్వంటీ సిరీస్ వరకు ధోనీకి విశ్రాంతి ఇచ్చి, కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించే అంశంపై బీసీసీఐ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. ఇదే నిజమైతే ధోనీ కెరీర్ ముగిసినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News