: ఇది 500 కోట్ల ఖరీదైన కేక్!


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేకును లండన్ కేక్ డిజైనర్ డెబీ వింగ్ హామ్ రూపొందించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువతికి నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. అలాగే, ఆమె పుట్టిన రోజు కూడా దగ్గర పడడంతో ఓకే రోజున రెండు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో బర్త్ డే కేకుకు ఆర్డరిచ్చారు. కేకు ఆర్డర్ విలువ 50 మిలియన్ పౌండ్లు (500 కోట్ల రూపాయలు). ఇంత ఖరీదైన కేకులో ఏముంటుందన్న సందేహం వచ్చిందా? 6 అడుగుల ఎత్తుతో 450 కేజీల బరువున్న ఈ కేకు మీద ర్యాంప్ వాక్ ను డిజైన్ చేశారు. ర్యాంప్ మీద ఓ మోడల్ క్యాట్ వాక్ చేస్తుంటే... చుట్టూ ఆహూతులు కూర్చుని ఉండగా... ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీయడం అన్న దృశ్యాన్ని డిజైన్ గా ఇందులో పొందుపరిచారు. ఈ కేక్ కు భారీతనం తెచ్చేందుకు కేకు తయారీలో 4000 వజ్రాలు వాడారు. ఈ కేకు తయారీకి 1100 గంటల సమయం పట్టిందని డెబీ వింగ్ హామ్ వెల్లడించారు. గతంలో 32.4 మిలియన్ పౌండ్ల విలువైన కేక్ ను తయారు చేసి అమ్మిన డెబీ, ఇప్పుడీ కేకే అత్యంత ఖరీదైనదని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News