: సల్మాన్, సోనమ్ జంట అందంగా కనిపిస్తారు: అనిల్ కపూర్ కితాబు


కండలవీరుడు సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంట చాలా అందంగా ఉంటుందని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. తన కూతురు సోనమ్, సల్మాన్ తో నటించడాన్ని వెండితెరపై చూసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. 'ప్రేమ్ రతన్ ధ్యాన్ పాయో' సినిమాలో సల్మాన్ కు జోడీగా సోనమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కుటుంబ కథా చిత్రమని అనిల్ అన్నారు. బాలీవుడ్ హీరోయిన్లలో సోనమ్ కపూర్ 'అప్టు డేట్' ఫ్యాషన్ ని అనుసరిస్తారు. సోనమ్ మొదటి సినిమా 'సావారియా'లో సల్మాన్ హీరో అయినప్పటికీ, సోనమ్ మాత్రం అందులో అతనితో జోడీ కట్టలేదు.

  • Loading...

More Telugu News