: బిగ్ బాస్ కు నోటీసులు పంపిన రాధేమా


కలర్స్ టీవీ ఛానెల్ లో అక్టోబర్ నుంచి ప్రసారం కానున్న రియాలిటీ షో బిగ్ బాస్ కు వివాదాస్పద సన్యాసిని రాధేమా నోటీసులు పంపించారు. ఈమధ్య బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ పేర్లలో రాధేమా పేరు కూడా వుంది. దీంతో రాధేమా బిగ్ బాస్-9లో అడుగుపెట్టనున్నారంటూ మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన రాధేమా తాను బిగ్ బాస్-9లో పాల్గోవడం లేదని, అవన్నీ పుకార్లని స్పష్టం చేశారు. అవకాశం వస్తే పాల్గొంటారా? అంటూ మీడియా ఆమెను ప్రశ్నించగా, అవకాశం లేదని తెలిపారు. అయితే బిగ్ బాస్-9లో పాల్గొంటున్నారన్న వార్తలను వ్యాపింపజేసి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ ఆమె బిగ్ బాస్ కు నిర్వాహకులకు నోటీసులు పంపించారు.

  • Loading...

More Telugu News