: డీఆర్ డీవోకు తొలిసారి మహిళా డైరెక్టర్ జనరల్ నియామకం


హైదరాబాద్ లోని డీఆర్ డీవోకు తొలిసారి మహిళా డైరెక్టర్ జనరల్ గా జె.మంజులను నియమించారు. ప్రస్తుతం ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ క్లస్టర్ ఇన్ ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డైరెక్టర్ జనరల్ గా ఉన్న డాక్టర్ కేడీ నాయక్ స్థానంలో మంజుల నియమితులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థురాలైన ఆమె హైదరాబాద్ లోని డీఆర్ డీవోలో ఇంట్రాగేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ విభాగంలో 26 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆమె 'పర్ ఫార్మెన్స్ ఎక్సలెన్స్', 'సైంటిస్ట్ ఆఫ్ 2011' అవార్డులు అందుకున్నారు.

  • Loading...

More Telugu News