: తెలంగాణకు తొలి సీఎం కేసీఆర్ కావడం అదృష్టం: డీఎస్


తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎం కేసీఆర్ కావడం ఎంతో అదృష్టమని ఆ పార్టీ నేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని, ప్రతి సబ్జెక్టుపై పూర్తి పట్టుందని అన్నారు. అధికారులతో గంటల తరబడి సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడారు. తాను కాంగ్రెస్ ను విడిచి పెట్టడానికి బలమైన కారణం ఉందన్నారు. పదవుల కోసం తాను ఏనాడు పాకులాడలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News