: డీఎస్పీ వాహనాన్ని ఢీ కొట్టిన ఆటో... రెచ్చిపోయిన పోలీసులు


కడప జిల్లా రాజం పేట డీఎస్పీ వాహనాన్ని వెనుక నుండి వచ్చిన ఒక ఆటో ఢీ కొట్టిన సంఘటనతో పోలీసులు రెచ్చిపోయారు. ఈ సంఘటనతో మిగతా ఆటోలను కూడా నిలిపివేశారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వారు ఏమి జరుగుతుందో తెలియక కంగారుపడిపోయారు. సంబంధిత సర్టిఫికెట్లను చూపించాలంటూ ఆటో డ్రైవర్లపై పోలీసులు విరుచుకుపడ్డారు. డీఎస్పీ వాహనాన్ని ఆటో ఢీ కొట్టడానికి, మిగతా ఆటోడ్రైవర్లకు సంబంధమేమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన వివరాలు.. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో డీఎస్పీ అరవిందబాబు వాహనం ఆర్ఎస్ రోడ్డులో వెళుతోంది. వెనుకగా వస్తున్న మిట్టమీదపల్లె ఆటో పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో డీఎస్పీ వాహనం వెనుకవైపు ఉండే సిగ్నల్ లైట్ పగిలిపోయింది. వెంటనే కిందకు దిగి వచ్చిన పోలీసులు ఆటోడ్రైవర్ శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. వాహనానికి గీతలు పడ్డాయని పోలీసులు తెలిపారు. ఆటోడ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News