: రికార్డు పుటల్లోకి ఎక్కిన 'క్వీన్ ఎలిజబెత్'


బ్రిటన్ ను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన పాలకురాలిగా క్వీన్ ఎలిజబెత్ నేడు రికార్డు పుటల్లోకి ఎక్కారు. 25 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిరోహించిన ఎలిజబెత్ 63 ఏళ్లుగా అప్రతిహతంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. 1952లో తన తండ్రి మరణానంతరం క్వీన్ ఎలిజబెత్ అధికారాన్ని చేపట్టారు. బ్రిటన్ కు ఈమె 40వ పాలకురాలు. తన పాలనాకాలంలో ఆమె మొత్తం 12 మంది బ్రిటన్ ప్రధానులను చూశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాణికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ శుభాభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News