: వార్తను కవర్ చేయబోయి తానే 'వార్త'గా మారిన కెమెరా ఉమన్!


సాధారణంగా జర్నలిస్టులు వార్తలు కవర్ చేస్తుంటారు. కానీ ఓ మహిళా జర్నలిస్టు వార్త కవర్ చేస్తూ, తానే వార్తగా మారి తీవ్ర విమర్శల పాలైంది. వివరాల్లోకి వెళ్తే...హంగేరీలో వార్తలందించే 'ఎన్ టీవీ1'లో పెట్రా లాజ్లో కెెమెరా ఉమన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సెర్బియా నుంచి హంగేరీ చేరిన శరణార్థులు రోజ్కే గ్రామం వద్ద తనిఖీలు పూర్తి చేసుకుని ఆ దేశంలో ప్రవేశిస్తారు. శరణార్థులను తనిఖీల కోసం రానిచ్చేందుకు గేట్లు తెరవడంతో బిలబిలమంటూ శరణార్ధులు పరుగు ప్రారంభించారు. ప్రాణ భయం, భవిష్యత్ బెంగతో ఉన్న శరణార్ధులు పిల్లలను ఎత్తుకుని పరిగెడుతుండగా వారి ఆందోళనను కెమేరాలో బంధిస్తున్న పెట్రాలాజ్లో, పిల్లాడితో పరిగెడుతున్న ఓ శరణార్థి కాళ్లకు తన కాళ్లు అడ్డం పెట్టారు. దీంతో ఆ వ్యక్తి పిల్లాడితో పాటు కిందపడిపోయాడు. దీనిని మరో ఛానెల్ కు చెందిన కెమెరా మెన్ చిత్రీకరించాడు. ఇదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు కారణమైంది. ఏంటీ, పైశాచికత్వం? అంటూ ఆమెపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చర్యలు బహిర్గతం కావడంతో సదరు టీవీ ఛానెల్ ఆమెను విధుల నుంచి తప్పించారు.

  • Loading...

More Telugu News