: 'గురువు' అన్న పదానికే కళంకం తెచ్చాడు
తల్లిదండ్రుల తరువాతి స్ధానం గురువుది...అలాంటి గురువు అన్న పదానికి కళంకం తెచ్చాడు ధావల్ త్రివేదీ (43). నాలుగు రాష్ట్రాల్లో ప్రిన్సిపల్ అవతారమెత్తిన ధావల్ రెండు లవ్ మ్యారేజీలు చేసుకోవడమే కాకుండా, 2008 నుంచి ఎనిమిది మంది యువతులను ఎత్తుకెళ్లిపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2010లో ఇద్దరు మహిళలను ఎత్తుకెళ్లిపోయి, ఏడునెలల పాటు మాయమైన త్రివేదీ, మరో రెండేళ్ల తరువాత తాను పనిచేస్తున్న కళాశాలలోని ఇద్దరు ఇంటర్ విద్యార్థినులను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతని లీలపై సీఐడీ దర్యాప్తుకు సిఫారసు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ విభాగం త్రివేదీపై సెక్షన్ 363 (కిడ్నాపింగ్), సెక్షన్ 366 (మహిళల మాయమాటలతో తీసుకెళ్లిపోవడం, వంచన చేయడం), 376 (అత్యాచారం), పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసింది. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ప్రిన్సిపల్ గా పని చేస్తూ ఈ ప్రిన్సిపాల్ ఇన్ని అరాచకాలకు పాల్పడ్డాడు.