: యాసిడ్ దాడుల కేసుల్లో నాలుగు రాష్ట్రాల సీఎస్ లకు సుప్రీం నోటీసులు
దేశ వ్యాప్తంగా యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ యాసిడ్ దాడుల కేసుల్లో అలసత్వం ప్రదర్శించిన కేరళ, కర్ణాటక, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఓ పిటిషన్ ఆధారంగా యాసిడ్ దాడి బాధితుల దురవస్థపై చర్చించేందుకు సమాధానం తెలియజేయాలన్న కోర్టు ఆదేశాలకు సదరు రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఘటనలపై స్పందించడంలో విఫలమయ్యారని అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.