: చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఒకటే: వరవరరావు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై ప్రముఖ విప్లవ కవి వరవరరావు మండిపడ్డారు. భూములను సేకరించే విషయంలో ఇద్దరి తీరు ఒకేలా ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు భూసేకరణ విషయంలో ఇష్టానుసారం ప్రవర్తిస్తుండటం వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఏపీలో రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బలవంతంగా భూసేకరణ జరిపి, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ అందరూ కలసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News