: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన కేసీఆర్
చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు డలియన్ లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు కేసీఆర్ తో పాటు ఆయన వెంట వెళ్లిన ప్రతినిధి బృందం కూడా హాజరైంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన 'ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు- అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు' అనే అంశంపై మాట్లాడతారు. అలాగే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వేదికపై నుంచి కోరనున్నారు. నేటితో కేసీఆర్ చైనా పర్యటన మూడో రోజుకు చేరుకుంది.