: బ్యాంకు చోరీకి గ్యాస్ కట్టర్లతో వచ్చిన దొంగలు... ఖాకీలను చూసి పరారైన వైనం!


చిన్న చిన్న దొంగతనాలతో ఇంకెంత కాలం నెట్టుకొచ్చేది అనుకున్నారో, ఏమో కాని ఓ దొంగల ముఠా ఏకంగా బ్యాంకుకే కన్నమేసేందుకు బయలుదేరింది. దోపిడీ చేయాలనుకున్న బ్యాంకు పరిసరాల వద్ద ముందుగానే రెక్కీ నిర్వహించారు. రెక్కీలో గ్రహించిన విషయాల మేరకు భారీ సరంజామాతోనే బయలుదేరారు. తీరా పనిలోకి దిగగానే, అటుగా వచ్చిన పోలీసు వాహనాన్ని చూసిన వారంతా బెంబేలెత్తిపోయారు. వెంట తెచ్చుకున్న సామగ్రిని అక్కడే వదిలేసి పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు బ్రాంచీ వద్ద నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు తలుపులు తెరిచేందుకు దొంగలు గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్లతో అక్కడికి వచ్చేశారు. బ్యాంకు వెనుకభాగంలో ఉన్న కిటికీ ఊచలను గ్యాస్ కట్టర్ తో అప్పటికే కట్ చేసే పనిని ప్రారంభించారు. ఐదు ఊచలు తెగాయో, లేదో పోలీసు వాహనం సైరన్ వారి చెవిన పడింది. దీంతో ఎక్కడ పట్టుబడతామోనన్న భయంతో వారు వెంట తెచ్చుకున్న సిలిండర్, కట్టర్లను అక్కడే వదిలేసి పరారయ్యారు.

  • Loading...

More Telugu News