: అమరావతి గురించి ప్రపంచమే చర్చిస్తుంది: చంద్రబాబు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి గురించి ప్రపంచమంతటా చర్చ జరిగే సమయం ఎంతో దూరంలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సుందర స్వప్నమైన రాజధాని నగర నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నిన్న డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రపంచస్థాయి నగరాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఆయన అన్నారు. అభివద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు డ్వాక్రా మహిళలు కృషి చేయాలని కోరారు. ఎవ్వరూ ఊహించని విధంగా నదుల అనుసంధాన్ని తాము సాకారం చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News