: స్కాట్లాండ్ శాస్త్రవేత్తల 'విస్కీ' ఇంధనం


విస్కీ తయారీలో వెలువడే వ్యర్థాలతో వాహనాలను నడిపించే ఇంధనాన్ని తయారు చేశారు స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు. విస్కీని తయారు చేస్తున్నప్పుడు వెలువడే వ్యర్థాలకు బయో ఇంధనాన్ని కలిపి దాన్ని కార్లకు ఇంధనంగా వాడి విజయం సాధించారు. ఇలా విస్కీని వాడి ఇంధనం తయారు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పుడు స్కాట్లాండ్ శాస్త్రవేత్తలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో కారుల్లో వాడే డీజిల్, పెట్రోల్ తో పోలిస్తే ఈ విస్కీ ఫ్యూయల్ వాడిన కారు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుందట. పర్యావరణానికి కలిగే నష్టం 60 శాతం వరకూ తగ్గుతుందని బ్రిటన్ మంత్రి ఆండ్రూ జాన్స్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News