: ఏనుగు దాడిలో శ్రీలంక జర్నలిస్టు మృతి
ఓ టీవీ జర్నలిస్టును ఏనుగు హతమార్చిన సంఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. ఫ్రీ లాన్స్ జర్నలిస్టు ప్రియనాథ రత్నయాకే (43) మిన్నేరియా గ్రామానికి సమీపంలో ఒక ఏనుగును టీవీలో చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలోనే అతడిని ఏనుగు కిందపడవేసి బలంగా తలపై కొట్టడంతో పాటు కాళ్లతో తొక్కడంతో ప్రియనాథ మృతి చెందాడు. ఏనుగును చిత్రీకరిస్తున్న దృశ్యాలను ఇంటర్నెట్ ద్వారా తన మిత్రులతో ప్రియనాథ షేర్ చేసుకున్నాడు. చివరి ఫుటేజ్ తర్వాత అంతా బ్లాంక్ అయిపోవడంతో అతడిపై ఏనుగు దాడి జరిగిందని నిర్ధారించారు. ఏనుగు అతడిని హతమార్చడం, అతని చుట్టూ రెండు సార్లు తిరగడం..ఇదంతా తాను చూశానని ప్రియనాథ సహ జర్నలిస్టు నిరోషన్ తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో జరగడం ఇదే ప్రథమం.