: ఐఎస్ఐఎస్ కమాండర్ పై పగ తీర్చుకున్న మహిళ
సిరియా, ఇరాక్ దేశాల్లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ పై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ క్రమంలో తన జీవితాన్ని నాశనం చేసిన ఐఎస్ కమాండర్ పై ఓ మహిళ పగతీర్చుకుంది. ఇరాక్ లోని మెసూల్ పట్టణానికి చెందిన కుర్దిష్ మహిళను ఐఎస్ కమాండర్ అబు అనాన్ అనే వ్యక్తి సెక్స్ బానిసగా మార్చాడు. అంతటితో ఆగకుండా ఆమెను పలువురికి విక్రయించాడు. ఎంత ఆవేదన అనుభవించిందో కానీ... ఆ కుర్దిష్ మహిళ అబు అనాన్ పై పగ పెంచుకుంది. సమయం కోసం ఎదురు చూసిన ఆమె అబు అనాన్ ను కాల్చి చంపి పగతీర్చుకుంది.