: మున్నీని వరించిన అవార్డు!
'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసిన వారికి మున్నీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సల్మాన్, నవాజుద్దీన్ సిద్దిఖీతో సమానంగా మున్నీ అభిమానులను ఆకట్టుకుంది. షూటింగ్ లో ఎంత అల్లరి చేసినా, సన్నివేశంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న హర్షాలీ మల్హోత్రాను భారతీయ టెలివిజన్ అకాడమీ అవార్డు వరించింది. భజరంగీ భాయ్ జాన్ లో ప్రదర్శించిన నటనకు గాను హర్షాలీ మల్హోత్రా ఉత్తమ బాల నటిగా నిలిచింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్ర దర్శకుడిగా భజరంగీ భాయ్ జాన్ సినిమాకు దర్శకత్వం వహించిన కబీర్ ఖాన్ నిలవడం విశేషం.