: హామీలు, ప్రకటనలకు పరిమితం కావడానికేనా రాష్ట్రం సాధించుకుంది?: జీవన్ రెడ్డి


కేవలం హామీలు, ప్రకటనలకు పరిమితం కావడానికేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది? అని కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా రైతుల సంక్షేమం గురించి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కూడా కేసీఆర్ కు లేదని విమర్శించారు. రైతు ఆత్మహత్యల విషయంలో టీడీపీ ప్రభుత్వంలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని అన్నారు. చైనా నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకురాగలిగితే మంచిదేనని... ఇదే సమయంలో చైనా పర్యటన మీద ఉన్న ఆసక్తిలో 10 శాతమైనా రైతులమీద ఉంటే బాగుండేదని చెప్పారు.

  • Loading...

More Telugu News