: సెక్స్ రాకెట్ నడిపిందంటూ రాధేమాపై మోడల్ ఆర్షిఖాన్ ఆరోపణలు
ఆధ్యాత్మికత ముసుగులో పలు అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న రాధేమాపై ఒక్కొక్కరుగా ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో ఆమెను మరిన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె సెక్స్ రాకెట్ నడిపిందంటూ తాజాగా మోడల్ అర్షిఖాన్ ఆరోపించారు. ఈ విషయమై తాను ముంబయి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని మీడియాకు తెలిపారు. రాధేమా మేనేజర్ ఒకసారి తన దగ్గరికి వచ్చి ఆ సెక్స్ రాకెట్ లో చేరాలని అడిగినట్టు చెప్పారు. అర్షిఖాన్ పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. గత నెలలో రాధేమాపై మరో బాలీవుడ్ నటి డాలీ బింద్రా కూడా ఇటువంటి ఆరోపణలతోనే పోలీసులతో కేసు నమోదు చేయించింది. మరోవైపు వరకట్నం కేసులో రాధేమాను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.