: పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇచ్చే విధానానికి స్వస్తి!


కొన్ని కేసుల విషయంలో పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఇందుకోసం సీఆర్ పీసీ 41ఎకు కేంద్ర న్యాయశాఖ సవరణ చేసింది. దాని ప్రకారం ఇకపై బెయిల్ కావాలంటే నిందితులు కోర్టుకు వెళ్లక తప్పదు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తప్పనిసరిగా కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలి. స్టేషన్ బెయిల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్న క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఉన్న నిబంధనల ప్రకారం, కొన్ని చిన్న కేసుల విషయంలో స్టేషన్ హౌజ్ ఆఫీసరే బెయిల్ ఇచ్చేలా అధికారాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News