: మారియాను మార్చడంపై ఎటువంటి రాజకీయం లేదు: హోం కార్యదర్శి


ముంబయి పోలీసు కమిషనర్ రాకేష్ మారియాను మార్చడంలో ఎటువంటి రాజకీయం లేదని ఆ రాష్ట్ర హోం కార్యదర్శి కేపీ బక్షీ స్పష్టం చేశారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని, సాధారణ పదోన్నతి బదలీల్లో భాగంగానే ఇది జరిగిందని చెప్పారు. షీనా బోరా హత్య కేసును మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న రాకేష్ మారియా పదోన్నతి, బదలీతో అనేక ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం శాఖ కార్యదర్శి ఈ ప్రకటన చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News