: ఇందిర, ఎన్టీఆర్ లే ఓడారు... కేసీఆర్ ఎంత?: కోమటిరెడ్డి
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోని టీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రైతుల ఆత్మహత్యలపై మీడియాలో వస్తున్న కథనాలను హరీష్ రావు చూడాలని అన్నారు. చైనా పర్యటన కోసం కేసీఆర్ ఖర్చు పెడుతున్న మొత్తాన్ని రైతు రుణమాఫీకి ఇస్తే బాగుండేదని చెప్పారు. తన అధికారం శాశ్వతం అన్న భ్రమలో కేసీఆర్ ఉన్నారని... గొప్ప నేతలైన ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లే ఓడిపోయారని, కేసీఆర్ ఎంత? అని ఆయన ఎద్దేవా చేశారు.