: చైనా 'పెయిన్'... మనకు 'గెయిన్'ఎలా? అంటూ ప్రశ్నించిన మోదీకి వచ్చిన సమాధానం ఇదిగో!


"చైనాలో నెలకొన్న ఆర్థిక కష్టాలను ఇండియా లాభాలుగా మార్చుకోవడం ఎలా?" భారత పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోదీ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. దీనికి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మోదీ తాజా పరిణామాలపై చర్చించారు. మోదీ ప్రశ్నకు అసోచామ్ ప్రతినిధులు స్పందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురై ఇండియాను ఇబ్బందులు పెడుతున్న సమస్యల నుంచి గట్టెక్కేందుకు విధానకర్తలు 'బులెట్ ప్రూఫ్'ను ఏర్పాటు చేయాలని కోరారు. వడ్డీ రేట్లను భారీగా తగ్గించాలని, ఉక్కు తదితర చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలను పెంచాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మంచి భవిష్యత్తు ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని ఐఎంఎఫ్ అంచనా వేసిన విషయాన్ని సమావేశానికి హాజరైన పారిశ్రామికవేత్తలు ప్రధానికి గుర్తు చేశారు. తాము ఊహించినంతగా సంస్కరణలను అమలు చేయడంలో సర్కారు వేగంగా స్పందించడం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, చైనా కష్టాలు భారత్ కు లాభంగా మారడం కష్టమేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News