: ఇసుకలో బోర్లా పడుకుని ... సిరియా బాలుడు అయిలన్ కుర్దీకి పాలస్తీనియన్ల నివాళులు
కొన్ని రోజుల కిందట టర్కీ పర్యాటక ప్రాంతం బోడ్రమ్ బీచ్ లో చనిపోయిన సిరియా బాలుడు అయిలన్ కుర్దీకి పాలస్తీనియన్లు నివాళులర్పించారు. గాజా బీచ్ లో 30 మంది పాలస్తీనియన్లు బాలుడి మృతి స్థితిని గుర్తుకు తెస్తూ ఎర్రని టీషర్ట్ లు, నీలంరంగు ప్యాంట్లు ధరించి ముఖాన్ని కిందకు ఉంచుతూ దాదాపు 20 నిమిషాల పాటు ఇసుకలో బోర్లా పడుకున్నారు. బాలుడి ఘటనకు సంతాపంగా గాజా బీచ్ లో సైకత శిల్పులు బాలుడి సైకతశిల్పాన్ని రూపొందించారు. ఆ శిల్పానికి కొద్ది అడుగుల దూరంలోనే ఈ రోజు పాలస్తీనియన్లు ఘనంగా నివాళులర్పించారు.