: స్టేజ్ పై స్టెప్పులేసిన స్మృతి ఇరానీ


కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, పంజాబ్ లోని ముక్సర్ లో జరిగిన ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొని విద్యార్థులతో కలిసి స్టేజిపై స్టెప్పులేశారు. స్మృతీ ఇరానీతో కలిసి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కోడలు హర్ స్మిత్ కౌర్ బాదల్ కూడా పాదం కలిపారు. వీరిద్దరూ కలిసి పంజాబ్ సంప్రదాయ నృత్యం 'గిడ్డా' బీట్ కు డ్యాన్స్ చేశారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గిరగిరా తిరుగుతూ, ఆహూతులతో చప్పట్లు కొట్టించారు. ఆపై విద్యార్థినులతో కలసి ఫోటోలు దిగారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు తదుపరి తరాలకు దగ్గరవుతాయని ఈ సందర్భంగా స్మృతి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News