: ఇస్నర్ ను గడగడలాడించిన ఫెదరర్!
మూడు పదులు దాటిన వయసులోనూ స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో ప్రత్యర్థులను గడగడలాడిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడే ముగిసిన మ్యాచ్ లో 13వ సీడ్, అమెరికన్ ఆటగాడు జాన్ ఇస్నర్ ను, తన పదునైన వ్యాలీలతో గడగడలాడించాడు. మూడు వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టాడు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మ్యాచ్ లో అత్యధిక భాగం బేస్ లైన్ షాట్లు కొట్టిన ఫెదరర్ 7-6, 7-6, 7-5 తేడాతో ఇస్నర్ పై విజయం సాధించాడు. తదుపరి రౌండులో ఫెదరర్, గాస్కెట్ ల మధ్య పోటీ జరుగుతుంది.