: యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం... మూడో సీడ్ ముర్రే ఔట్!


పెను సంచలనాలకు వేదికగా నిలుస్తున్న యూఎస్ ఓపెన్ ప్రస్తుత సీజన్ లో కొద్దిసేపటి క్రితం మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే మట్టి కోర్టు రారాజుగా కీర్తిగాంచిన రఫెల్ నాదల్ అనూహ్య ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తాజాగా భారీ ఆశలతో రంగంలోకి దిగిన మూడో సీడ్ అండీ ముర్రే నాలుగో రౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు. 15వ సీడ్ గా బరిలోకి దిగిన ఆండర్సన్ చేతిలో ముర్రే ఘోర పరాజయం పాలయ్యాడు. కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో 7-6, 6-3, 6-7, 7-6 స్కోరు తేడాతో ముర్రేను ఆండర్సన్ చిత్తు చేశాడు.

  • Loading...

More Telugu News