: చైనా చేరుకున్న కేసీఆర్... నేడు ఎన్నారైలతో సమావేశం


తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న సాయంత్రం చైనా చేరుకున్నారు. నిన్న ఉదయం 10 గంటలకు భారీ ప్రతినిధి బృందంతో శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కేసీఆర్, సాయంత్రం 6.30 గంటల సమయంలో చైనా నగరం డాలియన్ కు చేరుకున్నారు. అక్కడి షాంగ్రిల్లా హోటల్ లో ఆయన బస చేశారు. పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా చైనా పర్యటనకు వెళ్లిన కేసీీఆర్, నేటి నుంచే కార్యరంగంలోకి దిగుతున్నారు. నేడు చైనాలోని ఎన్నారై ప్రముఖులతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News