: బీహార్ లో వామపక్ష పార్టీల పొత్తు
బీహార్ లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఇప్పటికే జేడి (యు), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమిని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఓడించాలన్న లక్ష్యంతో ఆయా పార్టీలు పని చేస్తున్నాయి.