: సీఎం ఫడ్నవీస్ మోసగించిందేమీ లేదు: ముంబయి కోర్టు
పశువుల కాపర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మోసగించిందేమీ లేదంటూ బారామతిలోని ఓ కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ధన్ గార్ గా పిలువబడే పశువుల కాపర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పిస్తామంటూ గత ఎన్నికలలో ఫడ్నవీస్ హామీ ఇచ్చారని, ఆ హామీని సీఎం నిలబెట్టుకోలేదంటూ హేంత్ పాటిల్ అనే బీఎస్పీ కార్యకర్త ఒకరు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, ఈ కేసు విచారణకు జడ్జి అంగీకరించకపోగా, పైవిధంగా వ్యాఖ్యానించారు.