: జగన్ పెట్రోల్ పోసుకుని అంటించుకున్నా ప్రత్యేక హోదా రాదు!: ఎంపీ జేసీ
ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. తాను మొన్ననే చెప్పానని, ప్రత్యేక హోదా రాదు.. రాదు అని మళ్లీ గట్టిగా చెప్పారు. జగన్ పెట్రోల్ పోసుకుని అంటించుకున్నా హోదా రాదని మీడియాతో స్పష్టం చేశారు. ఇక హోదాపై కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలను, కేసులు పెట్టడం, రఘువీరారెడ్డి అరెస్టవడం... ఇదంతా ఓ నాటకంగా ఆయన కొట్టిపారేశారు. మోదీ, వెంకయ్య, బాబులపై కేసులు నమోదు చేయడానికి వాళ్లెవరని, కేసులు పెడితే రఘువీరాపైనే పెట్టాలన్నారు. అసూయతోనే కాంగ్రెస్ నేతలు కేసులు పెడుతున్నారు తప్ప మరొకటి కాదని జేసీ అన్నారు. ఏమైనా, ఏపీకి కేంద్రం బాగానే ఆర్థిక సాయం చేస్తుందని జేసీ ముక్తాయించారు.