: జీవీఎంసీ జోనల్ కమిషనర్ పై చంద్రబాబు ఆగ్రహం
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని మనోరమ థియేటర్ వద్ద కల్వర్ట్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా? అంటూ నిలదీశారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు శ్రీనివాస్ ప్రయత్నించగా చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు, జీవీఎంసీ కల్యాణమంటపం నిర్వహణ సరిగా లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా... వెంటనే సదరు కాంట్రాక్టర్ ను తొలగించాలని ఆదేశించారు. దాదాపు ఆరు గంటల పాటు విశాఖ నగరాన్ని చంద్రబాబు చుట్టేశారు. పోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు... కాలుష్యం అధికంగా ఉండటంపై మండిపడ్డారు.