: అసోం ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు


అసోంలోని ఏఐయూడీఎఫ్ కు చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ పై అత్యాచారం కేసు నమోదైంది. ఇంట్లో పనిచేసే బాలికపై గోపీనాథ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో బోకో పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్ పోస్టులో బాధితురాలు గత నెల 29న ఫిర్యాదు చేసింది. గౌహతిలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడని ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఆ బాలిక తమ ఇంటి నుంచి కొన్ని వస్తువులు దొంగిలించి పారిపోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు.

  • Loading...

More Telugu News