: కన్న కూతురినే బలిచ్చిన దుర్మార్గుడు
కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవ్వాలనే ఆశతో తన కన్నబిడ్డనే బలి ఇచ్చాడో దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని సికందర గ్రామంలో నివసిస్తున్న గిర్జేష్ అనే వ్యక్తి స్వతహాగా మంత్ర, తంత్ర విద్యలు సాధన చేస్తుంటాడు. ఈ క్రమంలో, తమ కుటుంబ ఆర్థిక స్థితి బాగుపడాలంటే కూతురుని బలివ్వాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇదే విషయాన్ని భార్యకు కూడా చెప్పాడు. ఈ విషయమై ఇద్దరికీ పెద్ద వాగ్వాదం జరిగింది. అనంతరం ముగ్గురు పిల్లలను గదిలోకి తీసుకెళ్లి పడుకుంది. కానీ, రాత్రి అదను చూసి కూతుర్ని ఎత్తుకెళ్లిన గిర్జేష్... ఆ అమ్మాయిని హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గిర్జేష్ ను అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు.