: భారత్ మ్యాట్రిమొనీ ఫిర్యాదుతో గూగుల్ పై విచారణ


సెర్చింజన్ దిగ్గజం గూగుల్, తన సొంత సేవలను ప్రమోట్ చేసుకోవడం, ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఇతర వెబ్ సైట్లను తక్కువ చేసి చూపుతోందన్న విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ మొదలైంది. భారత కాంపిటీషన్ చట్టాలను గూగుల్ ఉల్లంఘిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని సీసీఐ విచారణ కమిటీ తేల్చింది. వివాహ సేవలందిస్తున్న భారత్ మ్యాట్రిమోనీ డాట్ కాంతో పాటు ఎన్జీవో కన్స్యూమర్ యూనిటీ సంస్థ చేసిన ఫిర్యాదులపై సీసీఐ కేసు నమోదు చేసింది. దీనిపై విచారించిన అధికారులు "గూగుల్ అందిస్తున్న న్యూస్, మ్యాప్స్, ఫ్లయిట్స్ తదితర సేవలను ప్రమోట్ చేసుకునేందుకు నిబంధనల అతిక్రమణ జరుగుతోంది" అని సీసీఐ ఇన్వెస్టిగేషన్ డీజీ పైఅధికారులకు నివేదిక ఇచ్చారు. ఇదే విషయమై గూగుల్ ను వివరణ కోరగా, "సీసీఐ విచారణపై నివేదికను పరిశీలిస్తున్నాం. ఇప్పటికే విచారణకు పూర్తిగా సహకరించాం. ఇండియాలోని అన్ని కాంపిటీషన్ చట్టాలనూ మేము పాటిస్తున్నాం. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు" అని వెల్లడించింది. కాగా, గూగుల్ పై ఇదే తరహా కేసులు యూఎస్, జర్మనీ, తైవాన్, ఈజిప్ట్, బ్రెజల్ తదితర దేశాల్లో విచారణ దశలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News