: సీబీఐ ఆఫీస్ లో మంచు విష్ణు... సెన్సార్ ఆఫీసర్ లంచం కేసులో సాక్ష్యం!


టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు పెద్ద కుమారుడు, యువ హీరో మంచు విష్ణు కొద్దిసేపటి క్రితం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. సెన్సార్ బోర్డు సభ్యుడు శ్రీనివాసరావు కేసుకు సంబంధించి మంచు విష్ణు సీబీఐ అధికారుల ముందు సాక్షిగా విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఓ తెలుగు చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు శ్రీనివాసరావు నిర్మాతల నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు గత నెలలో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాక్షిగా మంచు విష్ణు పేరును సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టే క్రమంలో సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు మంచు విష్ణు నేడు సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపు జరిగిన విచారణ అనంతరం విష్ణు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News