: ముందు అవగాహన కల్పించి, తరువాత హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయండి: టి.రవాణాశాఖకు హైకోర్టు ఆదేశం
వాహనంతోపాటు హెల్మెట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న తెలంగాణ రవాణాశాఖ నిబంధనకు హైకోర్టులో చుక్కెదురైంది. ముందు 15 రోజుల పాటు వాహనదారుల్లో హెల్మెట్ వాడకంపై చైతన్యం కలిగించాలని సూచించింది. ఆ తరువాత హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ద్విచక్ర వాహనంతో పాటు హెల్మెట్ నిబంధనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. వాహనంతో పాటు హెల్మెట్ కొనుగోలు తప్పనిసరి కాదని తెలిపింది. అయితే ఇన్నాళ్లూ హెల్మెట్ నిబంధనను ఎందుకు అమలు చేయలేదని రవాణా శాఖను ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.