: శంషాబాదు చేరుకున్న కేసీఆర్... మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో చైనాకు!


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. చైనా పర్యటన కోసం నేటి ఉదయం హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన కేసీఆర్ నేరుగా ఎయిర్ పోర్టు చేరుకున్నారు. శంషాబాదు నుంచి ప్రత్యేక విమానంలో మరికాసేట్లో బయలుదేరనున్న కేసీఆర్ పది రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. చైనాలోని పలు నగరాల్లో పర్యటించే కేసీఆర్ బృందం తిరిగి ఈ నెల 16న రాష్ట్రానికి చేరుకుంటుంది. చైనా పర్యటనలో భాగంగా కేసీఆర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను కూడా సందర్శిస్తారు.

  • Loading...

More Telugu News