: ఈనెల 14న భారత్ కు విచ్చేస్తున్న శ్రీలంక ప్రధాని
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఈ నెల 14వ తేదీన భారత్ కు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయి, పలు విషయాలపై చర్చలు జరపనున్నారు. మరోవైపు, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అక్టోబర్ లో మన దేశంలో పర్యటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.