: పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ విగ్రహం ధ్వంసం


మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో, వైకాపా నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. నిరసనకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News