: రెండు నెలల క్రితం మొదలైన 'షోపో'లో రూ. 665 కోట్ల స్నాప్ డీల్ పెట్టుబడి


ఆ యాప్ రెండు నెలల క్రితం ప్రారంభమైంది. మొబైల్ యాప్ ద్వారా మాత్రమే సేవలందిస్తుంది. సూపర్ హిట్ అయింది. దీన్ని ప్రారంభించిన స్నాప్ డీల్ సైతం ఇంతటి విజయాన్ని ఊహించలేదు. ఇప్పుడిక దీన్ని మరింతగా విస్తరించాలన్న యోచనతో ఏకంగా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 665 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. జూలైలో మొదలైన 'షోపో' మొబైల్ మాధ్యమంగా సేవలందిస్తూ, ఎస్ఎంబీ (స్మాల్ అండ్ మీడియం బిజినెస్) వర్గాలకు దగ్గరైంది. పెద్ద పెద్ద ఈ-కామర్స్ వెబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకునే స్తోమతలేని చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఈ సంస్థ ఈ-మార్కెటింగ్ సేవలందిస్తుంది. ప్రారంభించిన నెలన్నరలో 20 వేల మంది వ్యాపారులు రిజిస్టర్ చేసుకుని తమతమ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచుకున్నారు. దీంతో స్నాప్ డీల్ యాజమాన్యం 'షోపో'పై ప్రత్యేక దృష్టిని సారించింది. వచ్చే సంవత్సరంలోగా పది లక్షల మందికి చేరువ కావాలన్న లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు స్నాప్ డీల్ సీఈఓ కునాల్ భాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News